గిరిబజారుకు భద్రగిరి మార్టుగా నామకరణం

గిరిబజారుకు భద్రగిరి మార్టుగా నామకరణం

భద్రాచలం, వెలుగు : సహజసిద్ధమైన గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన గిరిబజారు పేరును భద్రగిరి మార్ట్​గా మార్చినట్టు ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ప్రకటించారు. ఆయన ఐటీడీఏలో శుక్రవారం జీసీసీ, ఇతర శాఖల ఆఫీసర్లతో ఆయన భేటీ అయ్యారు.

భద్రగిరి మార్టును శ్రీరామనవమి రోజున ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్టు విజయవంతం కావాలంటే వ్యవసాయశాఖ సహకారం కూడా కావాలన్నారు. వ్యవసాయశాఖ ఏడీ, డీఏవో, ఏవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్​ నిర్వహించారు.